🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 21 Jul, 2026 | Page: 1

గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయండి

కల్లుగీతా కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళపెల్లి నర్సయ్య గౌడ్,జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్


వర్ధన్నపేట ప్రతినిధి, జులై 21,తరంగాలు : గీతన్నల చైతన్య యాత్ర (బస్సు యాత్ర) ను జయప్రదం చేయాలని కల్లుగీతా కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళపెల్లి నర్సయ్య గౌడ్,జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ పిలుపునిచ్చారు.
ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే కేజీ కేస్ అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రను పురస్కరించుకొని వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ముఖ్య సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి నర్సయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే బస్సు యాత్ర ఆగస్టు 14వ తేదీన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాల గీతా కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల గౌరవ అధ్యక్షులు సుదగాని లక్ష్మణ్ గౌడ్, మండల అధ్యక్షులు జనగాం యాకయ్య గౌడ్, కమిటీ సభ్యులు కొయ్యటి కుమారస్వామి, సట్ల నరసింహులు, బొల్లెపెల్లి కుమార్, లేబర్తి గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని రాజబాబు గౌడ్, దమ్మన్నపేట గౌడ సంఘం అధ్యక్షులు మెరుగు రాజు గౌడ్, మండలంలోని వివిధ గ్రామాల గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home