*ఆదివాసి (చట్టా)లను చులకనగా చూస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే*
--- ఆదివాసి చట్టాలపై అవగాహన లేక మాట్లాడుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్యాలను ఖండించిన సంఘాలు
--- గిరిజనేతరులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మెమోరండం అందించడం వెనక అంతర్యం ఏమిటి
---- (మాజీ నక్సలైట్) ఆదివాసి భూమిని తన అనుచరుడు కబ్జా చేసిన నోరు మెదపని ఎమ్మెల్యే
ఇల్లందు ప్రతినిధి జూలై 21, ( తరంగాలు): ఆదివాసి (చట్టా)లను ఇల్లందు ఎమ్మెల్యే చులకనగా చూస్తున్నారని, ఇది ఎమ్మెల్యే కు తగదని పలు సంఘాల నాయకులు ఆరోపించారు.సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో, కరెంట్ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇల్లందు మండల అధ్యక్షులు చింత ఉపేందర్ హాజరై మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గిరిజనేతరాలకు అన్యాయం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టానికి విరుద్ధంగా, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండల పరిధిలోని గిరిజనేతరులకు హక్కులు కల్పించాలని కలెక్టర్ ని కలిసి మెమోరండం ఇవ్వడం దురదృష్టకరం అని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివా సీలకు అటవిహక్కు పత్రాలు, వ్యవసాయం, కరెంట్ అవసరమై పోడు భూములలో కరెంట్ లైన్ల కోసం ఫారెస్ట్ అధికారులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక కష్టాలతో ఆదివాసి కుటుంబాలు కోట్టుమిట్టడు తుంటే ఆ సమస్యలను పక్కనెట్టి, గిరిజనేతర్లకు నొప్పి కలిగిందని కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టాన్ని సవాల్ చేస్తూ మెమొరండం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి కొంతమంది ఆదివాసి ప్రజాప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు మద్దతు పలకడం వల్ల జీవో నెంబర్ 3 ని నేరుగార్చి ఆదివాసి నిరుద్యోగ యువత కడుపు కొట్టిండ్రు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు 1/70 చట్టాన్ని లేకుండా చేయడానికి కొంతమంది మన ప్రజాప్రతినిధులే వాళ్ల రాజకీయ లబ్ది కోసం ఆదివాసీల చట్టాలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు సాగిస్తు న్నారని, ప్రజాప్రతినిధుల తీరు యావత్ ఆదివాసి సమాజం గమనించాల్సినఅవసరం ఎంతైనా ఉందన్నారు. బంధుత్వమని మనం మనుకుంటే మనపైన, మన చట్టాల పైన సవారి చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు వెలుగునివ్వడానికి తయారయ్యిండ్రు అంటూ ఆగ్రహించారు , ఏజెన్సీ ప్రాంతంలో భూములు కొనడానికి హక్కు లేదని ఇక్కడ చట్టాలు పటిష్టంగా ఉన్నాయని తెలిసి కూడా, వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా భూములు కొనడం,అమ్మడం, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారంటే మన ఎమ్మెల్యేలకు నిజంగా మనచట్టాల్ని కాపాడి , మన సమస్యల పై పట్టింపు లేదనేది తేటతెల్లం అవుతుందన్నారు. ఇది ఇలా ఉంటే ఇల్లందు మండలం పరిధిలోని బొల్లి రామయ్య (ఆదివాసి) అనే మాజీ నక్సలైట్ కి ప్రభుత్వం వారు సర్వేనెంబర్603 లోఇచ్చిన 3 గుంటల ప్రభుత్వ భూమిని, ఇల్లందు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేసి, ఆ కుటుంబాన్ని మానసిక శోభకు గురి చేస్తూ, అధికారబలంతో కుటుంబం పైన దాడులు చేస్తున్న మీ అనుచరుని పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు....? ఈ సమస్య పైన మాజీ నక్సలైట్ కుటుంబాన్ని కలెక్టర్ వద్దకు ఎందుకు తీసుకువెళ్లడం లేదు, ఒ ఆదివాసి ఎమ్మెల్యేగా ఉండి ఆదివాసి కి అన్యాయం జరిగిందంటే మాట్లాడకుండా ఉండటంపై అంతర్యం ఏమిటి అంటూ ప్రశ్నించారు......? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనేతరుడికి అన్యాయం జరిగిందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ని కలిసి మెమొరండం ఇచ్చిన మీరు, మీ అనుచరుడు మాజీ సర్పంచ్ కబ్జా చేసిన బొల్లి రామయ్య భూమిపై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. గిరిజనేతర్లే నాకు ఓటర్లు అనుకొని వారికే మా మద్దతు అంటే, భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో ఆదివాసి సమాజం ఒక్కటై ఏజెన్సీ ప్రాంతాన్ని కాపాడుకొనుట కోసం, బుద్ధి చెప్పాల్సివస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇ.రామచందర్, చైతన్య, గోవర్ధన్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.