🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 22 Jul, 2026 | Page: 1

జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా

జంతర్ మంతర్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా


మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్


న్యూఢిల్లీ, జులై 21,తరంగాలు :మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేసి, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా రిజర్వేషన్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా నిరసించారు.
ఈ ధర్నాలో పాల్గొన్న నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకమాంబ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేసి మహిళలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే రిజర్వేషన్ అమలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
🏠 Home