🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 22 Jul, 2026 | Page: 1

పేపర్ లీకేజీలను అరికట్టలేని చేతగాని బిజెపి ప్రభుత్వం

న్యాయం కోరిన విద్యార్థి-యువతపై లాఠీచార్జ్ అమానుషం

ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్



తరంగాలు ఖమ్మం జిల్లా బ్యూరో, 22జులై, తరంగాలు : గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు 100కు పైగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకుని లక్షలాది మంది విద్యార్థుల, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు న్యాయం కోరుతున్న విద్యార్థి, యువతపై దమనకాండకు పాల్పడుతోందని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై న్యాయ విచారణ జరిపి,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలోని విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, వారి హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని సాయికుమార్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ విద్యార్థులకు, యువతకు అన్యాయం జరిగినా అక్కడ యువజన కాంగ్రెస్ ముందుండి పోరాటం చేస్తుందని,ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వేజెండ్ల సాయికుమార్ స్పష్టం చేశారు.
🏠 Home