🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 22 Jul, 2026 | Page: 1

రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

ఇల్లంద గ్రామంలోని ఊర చెరువు నీటి కాలువ కబ్జా


చెరువు నీటి కాలువపై అక్రమ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని గ్రామ రైతుల ఆరోపణ

స్వలాభం కోసం ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువు కాలువలను ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

చెరువు కాలువ ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలి

ఆక్రమణలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

వర్ధన్నపేట తహసిల్దార్ విజయ్ సాగర్ వినతిపత్రం అందజేసిన ఇల్లంద గ్రామ రైతులు

వర్ధన్నపేట ప్రతినిధి, జులై 22,తరంగాలు : రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఊర చెరువుకు సంబంధించిన నీటి కాలువను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారంటూ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువు కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల చెరువుల సహజ ప్రవాహ మార్గాలు దెబ్బతిని, భవిష్యత్తులో రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అక్రమ ఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ రైతులు వర్ధన్నపేట తహసిల్దార్ విజయ్ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. పూర్వం నుండి మా పొలాలకు నీరు వెళ్లడానికి కాలువ బాట ఉందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొందరు దానిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని చెరువులు, కాలువలను పరిరక్షించి ప్రభుత్వ భూములను కాపాడాలని రైతులు తహసిల్దార్ ను కోరారు .
🏠 Home