🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 27 Jul, 2026 | Page: 1

ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో మేధావుల పాత్ర కీలకం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ


హైదరాబాద్, జూలై 27, తరంగాలు :ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో మేధావుల పాత్ర కీలకం అని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ అన్నారు.హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న తాజ్ డెక్కన్ హోటల్‌లో నిర్వహించిన "ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్" మేధావుల సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి మాట్లాడుతూ, ఆత్మనిర్భర భారత్ దేశ ఆర్థికాభివృద్ధికి ఎలా బలమైన పునాదిగా నిలుస్తుందో, అలాగే మారుతున్న ప్రపంచ క్రమంలో భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థాయికి ఎలా ఎదుగుతోందో సమగ్రంగా వివరించారు. స్పష్టమైన జాతీయ దార్శనికత, సమర్థవంతమైన నాయకత్వం, స్వావలంబన పట్ల అచంచలమైన నిబద్ధతతో భారత్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
సదస్సు అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశగా విలువైన ఆలోచనలు, లోతైన విశ్లేషణలను పంచుకున్న ఎస్. గురుమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మేధావుల సూచనలు దేశ నిర్మాణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సన్‌షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువా రెడ్డి, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్ దత్త్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home