🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 08 Aug, 2026 | Page: 1

కేసముద్రం కాంగ్రెస్‌కు "కొత్త సారథి.. సమ్మి గౌడ్"




మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మి గౌడ్ నియామకం

నిజాయితీ,నిస్వార్థానికి నిలువుటద్దం..


“పదవి కోసం కాదు.. ప్రజాసేవ కోసమే పనిచేస్తా”

“24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..

పార్టీ బలోపేతమే నా లక్ష్యం”

అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సమ్మి గౌడ్

కేసముద్రం, ఆగస్టు 7,తరంగాలు ప్రతినిధి :కేసముద్రం కాంగ్రెస్‌కు "కొత్త సారథి"..గా సమ్మి గౌడ్ పేరును శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మి గౌడ్ నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నిజాయితీ, నిస్వార్థానికి నిలువుటద్దంగా పేరొందిన సమ్మి గౌడ్‌కు మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ పదవిని హోదాగా భావించకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కలుపుకుంటూ, అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారి సమస్యలకు అండగా నిలుస్తానని చెప్పారు. 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని సమ్మి గౌడ్ తెలిపారు.
“ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడే.. కార్యకర్తల బలం, నాయకుల మార్గదర్శకత్వంతో కేసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే నా ప్రధాన లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
🏠 Home