బీజేపీ బలోపేతమే నా లక్ష్యం...వన్నాల వెంకటరమణ
పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తా.. ప్రజాసేవకు మరింత ప్రాధాన్యం
జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌ను కలిసిన వన్నాల
వాక్ ఫౌండేషన్ సేవలను వివరించిన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (తరంగాలు):
బీజేపీని తెలంగాణలో మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ అప్పగించే ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ను డా. వన్నాల వెంకటరమణ, ఆయన తండ్రి, మాజీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు వన్నాల శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర, జాతీయ పార్టీ నాయకత్వానికి డా. వన్నాల వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడతానని బి.ఎల్. సంతోష్‌కు తెలిపారు. పార్టీ శ్రేయస్సు, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
*పేదలు,విద్యార్థులకు అండగా వాక్ ఫౌండేషన్*
డా. వన్నాల వెంకటరమణ ఆధ్వర్యంలో వాక్ ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను బి.ఎల్. సంతోష్‌కు వివరించారు. పేద కుటుంబాలకు నిరంతరం బియ్యం పంపిణీ చేయడంతో పాటు నిరుపేద విద్యార్థుల పాఠశాల, కళాశాల ఫీజులు చెల్లించడం, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సేవలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ సమాజంలోని పేదలు, విద్యార్థులకు అండగా నిలుస్తామని డా. వన్నాల వెంకటరమణ పేర్కొన్నారు.