🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 08 Aug, 2026 | Page: 1

WSSH ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు



వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు

మధ్యవర్తులను ఆశ్రయించవద్దని MGM సూపరింటెండెంట్‌ సూచన

వరంగల్ ఆగస్టు 8,తరంగాలు : వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (WSSH)లో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కాలేదని MGM ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీ పేరుతో కొందరు మధ్యవర్తులు, దళారులు ప్రజలను సంప్రదించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం మాత్రమే, అందులో పేర్కొన్న విధానం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఉద్యోగార్థులు ఎలాంటి వ్యక్తిగత చెల్లింపులు చేయవద్దని సూచించారు.
🏠 Home