🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 13 Aug, 2026 | Page: 1

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక వైద్య శిబిరం

వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 13,తరంగాలు : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ మేరకు ఇల్లంద ఎస్సీ కాలనీలో ఆరోగ్య ఉపకేంద్రం–2 ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
శిబిరంలో కాలనీ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్య సిబ్బంది సూచించారు. వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, వార్డు సభ్యులు జోగుల అనూష, తుళ్ల శైలజ, ఏఎన్‌ఎం సరోజ, ఆశా కార్యకర్త అపరంజి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home