🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 15 Aug, 2026 | Page: 1

వర్ధన్నపేటలో జాతీయ జెండాకు అవమానం:

తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 15,తరంగాలు : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తీవ్ర పరాభవం ఎదురైంది. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు ఆరూరి రమేష్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు.
జెండా ఆవిష్కరించిన వెంటనే దాన్ని గమనించిన అక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన నాయకులు, వెంటనే పొరపాటును సరిచేసి, జెండాను సరిగ్గా అమర్చి తిరిగి ఎగురవేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన మాజీ ప్రజాప్రతినిధి జాతీయ జెండా పట్ల కనీస అవగాహన లేకుండా వ్యవహరించడంపై స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మువ్వన్నెల జెండాకు జరిగిన ఈ అవమానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
🏠 Home