కళాకారుల ప్రతిభ సమాజానికి ఎంతో అవసరం
యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలువాలి
ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, విశిష్ట కళా సేవ రత్న పురస్కార గ్రహీత, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
హన్మకొండ ప్రతినిధి,ఆగస్టు 24,తరంగాలు : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు జెబి కల్చరల్ ఆర్ట్ సొసైటీ (వరంగల్) ఆధ్వర్యంలో స్థానిక పబ్లిక్ గార్డెన్‌లోని పద్మ శ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జరుగుతున్న "ఓరుగల్లు జానపదాల స్వరాల ఝల్లు కాకతీయ సకల కళల జాతర" ఉత్సవాలు రెండోవ రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, విశిష్ట కళా సేవ రత్న పురస్కార గ్రహీత, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద కళాకారులు, కవులు, గాయకులను ఒకే తాటిపైకి తెచ్చి 'కళాకారుల జేఏసీ'గా ఏర్పాటు చేసి ఓరుగల్లు (వరంగల్) వీరత్వానికి, కళలకు పుట్టినిల్లు కావడంతో, ఇక్కడి నుండి సాగిన ధూం ధాం ప్రదర్శనలతో ప్రజలకు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా జానపద కళాకారులు, కవులు మరియు గాయకులు అత్యంత కీలకమైన పాత్ర పోషించి తమ ఆట, పాట మరియు మాటలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించడంలో కళాకారుల త్యాగం మరియు కృషి ఎనలేనివి అని కళాకారుల గొంతుకలు, వారి ప్రతిభ సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు.
నేటి సాంకేతిక యుగంలో యువత తప్పుదోవ పట్టకుండా ఉండటానికి మన జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయని, ఇతిహాసాలు, కథలు మన జీవితంలో ఏది మంచి, ఏది చెడు అని నేర్పే జీవన వేదాలని, కళను నేర్చుకోవడం వల్ల యువతలో ఏకాగ్రత, పట్టుదల మరియు క్రమశిక్షణ పెరిగి చెడు సావాసాలకు దూరంగా ఉండడానికి తోర్పడతాయని అన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే పిల్లలకు మన మూలాలు మన సంస్కృతిని, పురాణ పురుషుల కథలను, వారి త్యాగాలను, ధర్మాన్ని వివరించి వాటిని భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజంతో పాటు మన సంస్కృతి సజీవంగా ఉండి నేటి యువత మన సంస్కృతీ సంప్రదాయాల వైపు అడుగులు వేసేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కళలు కేవలం వినోదాన్ని మాత్రమే కాక, సమాజానికి అవసరమైన నైతిక విలువలను, క్రమశిక్షణను మరియు సాంస్కృతిక స్పృహను అందిస్తాయని, మన జానపద, శాస్త్రీయ కళలను ఆదరించడం అంటే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అని యువతను ఈ కళల వైపు నడిపిస్తే, వారు చెడు వ్యసనాలకు దూరమవ్వడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదుగుతారు అని తెలిపారు.అనంతరం ముఖ్య అతిథి ఈగ మల్లేశం కళాకారుల ప్రతిభను అభినందిస్తూ కళాకారులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జె బి కల్చరల్ ఆర్ట్ సొసైటీ జడల శివ కు శాలువా కప్పి మెమెంటోలతో గౌరవప్రదంగా సన్మానించారు. సభా కార్యక్రమం అనంతరం జె.బి. కల్చరల్ ఆర్ట్ సొసైటీ నిర్వాహకులు, కళాకారులందరూ కలిసి ముఖ్య అతిథి ఈగ మల్లేశం సమాజానికి మరియు కళారంగానికి చేసిన సేవలను కొనియాడుతూ శాలువా, గజమాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను (మెమొంటో) బహుకరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆడెపు రవీందర్ , వడ్నాల నరేందర్, కరిమిల సంపత్ రావు, జూలూరి శ్రీనివాస్, సంపత్, శ్రీమతి దీకొండ ప్రమీల సారంగపాణి, రాజ్యలక్ష్మి, హిందీ సింగర్ శ్యామ్ , మక్దూం, ప్రసాద్, ఎస్కే రాజు, సురేందర్ ,ఇమ్మానుయేల్, మున్నా, తోట రవి, రంగనాధ్, చంద్రశేఖర్, నిమ్మల శ్రీను, బుజంగారావు, శిభ, రోజరాణి, గాయత్రి ,బిక్షపతి, శ్రీకాంత్, మురళి మధు, కాజిపేట ప్రభాకర్, చిరంజీవి, ప్రవీణ్, మామిండ్ల లక్ష్మణ్ ,ప్రముఖ జానపద కళాకారులు గర్జన గిద్దె రాంనర్సయ్య, బాబ్జి, జూపక శివ, మురళి మధు, శ్రీకాంత్, ప్రసాద్, ధార దేవేందర్, రేల కుమార్, శంకర్ సురేందర్, మ్యాజిక్ శ్రీను, సృజన్ రావు, రంగనాధ్, గుజ్జరీ రమేష్, చంద్రమౌళి, ప్రభాకర్ గార్లకు లకు పురస్కార అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా జనగాం రాము వ్యవహరించారు ,అలాగే తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి జానపద, ఒగ్గు, చిందు, యాక్షగానం, భాగవతులు, శాస్రియ కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.