సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షురాలిగా కుల్లా పావని-యాకాంతం
ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు ప్రకటన
వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 24,తరంగాలు : వర్ధన్నపేట మండల సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షురాలిగా వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ కుల్లా పావని యాకాంతం నియమితులయ్యారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు ఆమెను మండల అధ్యక్షురాలిగా ప్రకటించినట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా పోశాల వెంకన్న మాట్లాడుతూ.. మండలంలోని సర్పంచుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కుల్లా పావని కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్య నారాయణ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మెరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.