🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 26 Aug, 2026 | Page: 1

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు కుల్ల పావనికి అభినందనలు



తెలిపిన కాంగ్రెస్ మండల నాయకులు,సర్పంచులు


సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా దుబ్బ అంజయ్య ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాలతో కాంగ్రెస్ సర్పంచులతో మండల ముఖ్య నాయకుల సమావేశం

వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 26,తరంగాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్య నారాయణ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడీ రాజ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతి బాణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా ఎన్నికైన వెంకట్రావుపల్లి సర్పంచ్ కుల్ల పావనిని నాయకులు, సర్పంచులు అభినందించారు. అనంతరం సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడిగా దమ్మన్నపేట సర్పంచ్ దుబ్బ అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ
కార్యక్రమంలో జిల్లా నాయకుడు మరుపట్ల సాయికుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, బండౌతాపురం సర్పంచ్ బత్తిని దశరథం, ఖాషాగూడెం సర్పంచ్ రజాక్, చెన్నారం సర్పంచ్ సింధం లలితా లక్ష్మీనారాయణ, రామోజీ కుమ్మరిగూడెం సర్పంచ్ భూక్యా సుశీల, చంద్రుతండా సర్పంచ్ భూక్యా లీలా రవి తదితర సర్పంచులు పాల్గొన్నారు.
🏠 Home