🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 30 Aug, 2026 | Page: 1

కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

వర్ధన్నపేట బిజెపి మండల అధ్యక్షులు అడుప రాజు

వరంగల్, (తరంగాలు ప్రతినిధి):
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, వారి విద్యను సంక్షోభంలోకి నెడుతోందని వర్ధన్నపేట బీజేపీ మండల అధ్యక్షులు అడుప రాజు విమర్శించారు. వరంగల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు అడుప రాజు పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు పూర్తవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల కారణంగా అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అడుప రాజు కోరారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రగొళ్ల భరత్ వీర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home