🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 30 Aug, 2026 | Page: 1

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎవరు..? నాయిని... అల్లుడా

ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడికి వత్తాసు పలుకుతున్న హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి

పండుగల స్వేచ్ఛను హరిస్తే సహించం

ఒక పక్షానికే కొమ్ముకాస్తున్నారా? పోలీసులపై రావు పద్మ రెడ్డి ఆగ్రహం

రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు కోసం బిజెపి పోరాడుతుంది

హిందూ పండుగలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

హిందూ పండుగలపై ఆంక్షలా..? అర్ధరాత్రి అరెస్టులా..?

ఇది ప్రజా పాలనా.. రాక్షస పాలనా..?

హిందూ యువకుల అరెస్టులపై రావు పద్మ రెడ్డి ఫైర్

హనుమకొండ ప్రతినిధి, ఆగస్టు 30,తరంగాలు :వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎవరు..? నాయిని రాజేందర్ రెడ్డి నా లేదా తన ఆంద్రా అల్లుడా అని రావు పద్మ ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే రాజ్యాంగ హక్కు ఉంది. కానీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హిందూ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా, రాత్రికి రాత్రే అర్ధరహితంగా అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం" అని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మ రెడ్డి మండిపడ్డారు.
అర్ధరాత్రి వేళల్లో తండ్రి దొరక్కపోతే కొడుకును, కొడుకు దొరక్కపోతే తండ్రిని అరెస్ట్ చేయడం ఏ రకమైన రాక్షస పాలనో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి అసలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా? అని ప్రశ్నించారు.
"ఎమ్మెల్యేను మేము గౌరవిస్తాం... కానీ ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడి పెత్తనం ఏంటి? ఆయన చెప్పారని హనుమకొండ సీఐ ఒక పక్షానికే కొమ్ము కాస్తూ, హిందూ యువకులను వేధిస్తూ నిరంకుశంగా ప్రవర్తించడం సరికాదు. ఎమ్మెల్యే అల్లుడికి వత్తాసు పలుకుతున్న హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ యువకులను అక్రమంగా అరెస్టు చేశారు అనే విషయం తెలుసుకున్న రావు పద్మ రెడ్డి, బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ తో కలిసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కి చేరుకొని సీఐనీ ప్రశ్నించి పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బన్నీ, బంటి, రాహుల్ లను అక్కడికక్కడే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ... బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ అనీ రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు హక్కుల కోసం, పండుగలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవడం కోసం తాము ఎప్పుడూ ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉండే వరంగల్ వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి నిరంకుశ చర్యలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
🏠 Home