🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 03 Sep, 2026 | Page: 1

ఉరి శిక్షే సరైన సమాధానం

అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితుడిని వదలొద్దు..
ఆదివాసి నర్సు శిరీష హత్యపై రాష్ట్ర పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోతు స్వరూప ఆగ్రహం

ఆదివాసి బిడ్డ ప్రాణానికి విలువ లేదా? శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

మహిళల భద్రత ఎక్కడ? శిరీష హత్యపై ప్రభుత్వాన్ని నిలదీసిన స్వరూప

ములుగు ప్రతినిధి, సెప్టెంబర్ 03,తరంగాలు : ఆదివాసి, గిరిజన నర్సింగ్ విద్యార్థిని ఊకె శిరీషపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా కఠినంగా శిక్షించాలని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోతు స్వరూప డిమాండ్ చేశారు. శిరీష హత్య ఘటన అత్యంత దారుణమని, మహిళల భద్రతపై ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
శిరీషను కోల్పోయిన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొన్న స్వరూప.. బాధిత కుటుంబానికి తక్షణమే తగిన నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివాసి బిడ్డ ప్రాణానికి విలువ లేదా? అని ప్రశ్నించారు.
మహిళలు,ముఖ్యంగా ఆదివాసీ,గిరిజన మహిళలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని ఆమె అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పునరావృతం కాకుండా కఠిన చట్టాల అమలు, వేగవంతమైన దర్యాప్తు, నిందితులకు శీఘ్ర శిక్షలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీలను కార్యాచరణలో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని స్వరూప అన్నారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఆదివాసీ సమాజం తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శిరీషకు న్యాయం చేయడమే లక్ష్యం.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
🏠 Home