ప్రతీ పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలు
స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత భరోసా
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు
వర్ధన్నపేటలో సంక్షేమ సంబరాలు.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
వర్ధన్నపేట ప్రతినిధి , తరంగాలు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని,
స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత భరోసా అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు.
వర్ధన్నపేటలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో తహసిల్దార్ విజయసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా, సులభంగా ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం వర్ధన్నపేట సెంటర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాసులు కాల్చి, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి-రాజేందర్, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య,వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక అనిల్, సొసైటీ చైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ , పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.