భగీరథ యత్నం వీడని రెవెన్యూ అందత్వం
---నిరుపేద కుటుంబం పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
----మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని సమస్య పరిష్కరిం చాలి
----స్థానికులు, మానవతా వాదుల విజ్ఞప్తి
ఇల్లందు ప్రతినిధి, సెప్టెంబర్ 4( తరంగాలు): ప్రభుత్వాలెన్ని మారినా, ఆంధ్ర ఆధిపత్య నాయకత్వంతో కొట్లాడి సొంతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుని సొంతింటి ప్రభుత్వం కొలువు దీరినా అభాగ్యుల బతుకుల్లో కాసింత కూడా వెలుగు కానరాని పరిస్థితి నెలకొంది. దశాబ్ధ కాలానికి పైగా కొట్లాడి..గోసపడి సాధించుకున్న సొంత రాష్ట్రం లో ఆడబడుచులకు ఇంటి ముంగిట్లోకి తాగునీరు సరఫరా చేసేందుకు గొప్పగా అమలు చేసిన మిషన్ భగీరథ.. రాష్ట్రంలో ధ్వంసమైన చెరువుల పరిరక్షణకు మిషన్ కాకతీయ పథకం ఓ కుటుంబాన్ని అభాగ్యుల్ని చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా. ప్రస్తుతం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాగబోయిన గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తెలగ గుంపు (తంగెళ్లగడ్డ)లో ఓ కుటుంబం దయనీయ పరిస్థితి ఇది.
*కంటి చూపు లేని కుటుంబం*
ఆ కుటుంబ సభ్యులంతా పాక్షికంగా, పూర్తిగా కంటి చూపు లేని నిరుపేదలు. మిషన్ కాకతీయలో వారి సాగుభూమంతా చెరువులో మునిగిపోయినా పట్టించుకునే నాథుడే లేడంటే అతిశయోక్తి కాదు. అసలే వికలాంగులు.. దాదాపు 4 ఎకరాల సాగు భూమి చెరువులో మునిగి పోయాక తినడానికి గాసం లేక ఆ కుటుంబం పడుతున్న కష్టా లు తనివి తీరా చూడాల్సిందే కానీ.. చెప్పనలవి కాదు. మిషన్ కాకతీయ కింద భూమిని స్వాధీనం చేసుకున్న ఎమ్మార్వో, ఇతర రెవెన్యూ అధికారులు భూమి లెక్కలు పక్కగా చూసి పరిహారం చెల్లిం చి.. ఈ అభాగ్య కుటుంబం కన్నీళ్లు తుడిచేందుకు ఎంత మాత్రమూ పని చేయలేదన్నది నిష్ఠూర సత్యం. పాలకులె వరైనా ప్రతి రోజూ అధికారిక సమీక్షలు.. సామాన్యులకు అన్యాయం జరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రజల ముంగిట్లోకే పాలన తీసుకొచ్చాం అని ఊరూవాడా ఢంకా బజాయించి చెప్పుకునే అధినేతలు క్షేత్రస్థాయిలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందని కనీసం తొంగి చూసేం దుకు సాహసించరంటే అతి శయోక్తి కాదు.
*రెవిన్యూ వ్యవస్థ తీరు*
గత ప్రభుత్వం రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా కింద రూ.5 లక్షలు అందిస్తూ వచ్చింది. కానీ, ఈ కుటుంబ యజమాని చనిపోతే వయస్సు ఎక్కువైంది కనుక రైతు బీమా రాదు అని రెవెన్యూ యంత్రాం గం దాటవేసింది. అంతకు ముందు సామాజిక పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే వయస్సు తక్కువ కనుక పెన్షన్ రాదని వింత సమాధానాలిచ్చారు.
2014కు ముందు రూ.500 గా ఉన్న పెన్షన్ తర్వాత రూ.1,000 వృద్ధులకు ఇస్తే తర్వాత రూ.2,000 పెరిగింది. ఇంట్లో అందరూ వికలాంగులే కనుక వారికి వికలాంగుల పెన్షన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం సామాజిక పెన్షన్లపైనే ఆధార పడి జీవిస్తున్న ఈ కుటుంబం ఆదుకునే వారు లేక అల్లాడిపో తోంది. ఎవరైనా విషయం తెలిసి పలకరించడానికి వెళితే తమ బాధ కూడా చెప్పుకోలేని విపత్కర పరిస్థితుల్లో ఉన్నారీ కుటుంబ సభ్యులు. ప్రభుత్వ పథకం కింద ఇల్లు వచ్చిందని చెబుతున్నా.. వారు ఉంటున్న ఇల్లు ప్లాస్టింగ్ చేయక .. వర్షా లొచ్చినప్పుడు కురుస్తోంది. చలి కాలంలో చలి కూడా అధికమే. ఈ విషయం మీడి యా ద్వారా తెలియడంతో గతంలో కారేపల్లి మండలం చీమలపాడులో పని చేసి.. తాజాగా రిటైరైన ఉపాధ్యా యుడు ఉపేందర్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. దాదాపుగా నెలవారీగా భారీ మొత్తంలో తనకు తెలిసిన వారి ద్వారా పంపి.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ఆ నలుగురిలో ఒకరికి నేత్ర చికిత్స చేస్తే కంటి చూపు వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ ఒక్కరికీ కంటి చూపు వస్తే మొత్తం కుటుంబానికి ఆసరాగా ఉం టుందని..హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూ ట్‌లో వైద్యం చేయించడానికి కూడా రిటైర్డ్ టీచర్ సిద్ధంగా ఉన్నారు.. హైదరాబాద్‌కు తీసుకెళ్లే వారు లేక ఇంటికే పరిమితమై.. రేషన్ కార్డుపై వచ్చే బియ్యం వండుకుంటూ.. తమకు వచ్చే సామాజిక పెన్షన్లతో జీవనం సాగిస్తు న్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడంతోపాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించాలని స్థానికులు, మానవతా వాదులు కోరుతున్నారు. సమస్య తెలుసుకుని స్పందించడంలో ముందుండే రాష్ట్ర రెవెన్యూ, సమాచార, ప్రసారాలు, గృహ నిర్మాణశాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాస్త నజర్ తమ అభాగ్య కుటుంబంపై ప్రసరింపజేసి.. వారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.