దళిత స్పీకర్ పై బీ.ఆర్.ఎస్ అహంకారం తగదు
వర్ధన్నపేట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం
వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 8,తరంగాలు గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్వీకరణ ఉద్దేశించి బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు మరియు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కుల్ల యాకాంతం మాట్లాడుతూ
ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని,అలాంటిది ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ను పట్టుకొని అంతటి అసభ్య పదజాలంతో దూషించడం బీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారానికి, దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు. పదవుల అహంకారంతో ప్రతిపక్ష నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని గౌరవించడం కనీస బాధ్యత అని, దళిత స్పీకర్ ను అవమానించడం అంటే మొత్తం దళిత సమాజాన్ని అవమానించడమేనని యాకాంతం స్పష్టం చేశారు. తక్షణమే బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, స్పీకర్ కు మరియు దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే బీ.ఆర్.ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతారని వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం హెచ్చరించారు.