🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 11 Sep, 2026 | Page: 1

రీ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి


చెన్నారం గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు కలెక్టర్

వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 10,తరంగాలు :
వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. కిషోర్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న సర్వే ప్రక్రియ, భూముల హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర అంశాలను ఆయన పరిశీలించారు.గ్రామంలో రీ సర్వే పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి అనే అంశాలపై సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, అందుబాటులో ఉన్న భూ రికార్డులతో వివరాలను సరిపోల్చాలని సూచించారు.భూ హద్దుల నిర్ధారణ సమయంలో రైతులు, భూ యజమానులకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.రీ సర్వే పూర్తయిన అనంతరం భూ వివరాలు స్పష్టంగా, కచ్చితంగా నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రైతులకు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం అందిస్తూ, వారి అభ్యంతరాలు, సూచనలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని పేర్కొన్నారు.రీ సర్వే పనుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సర్వే వివరాలు, భూ హద్దులు, రికార్డుల నమోదులో పూర్తి కచ్చితత్వం పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా రీ సర్వే పనులను పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ రిసర్వే పరిశీలనలో
ఎడి సర్వే మరియు భూ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు
వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్ సాగర్ ,మండల సర్వే అధికారులు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home