చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
వర్ధన్నపేట ఏపీఎం రమణాచారి
వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 10,తరంగాలు : సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శనీయమని వర్ధన్నపేట ఏపీఎం రమణాచారి అన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఐకేపీ భవనం వద్ద బృందావనం మండల సమైక్య సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రమణాచారి, సభ్యులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రమణ చారి మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐరమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీలు అనిత, రమ,రేణుక, ఎంఎస్ ప్రెసిడెంట్ ప్రమీలదేవి, సెక్రటరీ స్వర్ణలత, ట్రెజరర్ కల్పన, కంప్యూటర్ ఆపరేటర్ మురళీమోహన్, వీఓఏలు పద్మ, సుజాత, అనిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.