చెరువు భూమి 100 గజాలైన ఆక్రమించారా..?
ఆక్రమణ నిరూపిస్తే..దేనికైనా సిద్ధం
మాటలతో కాదు.. రికార్డులతో తెల్చుకుందాం..
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు "ఓపెన్ ఛాలెంజ్ "
నిమ్మని శేఖర్‌రావు భూమిపై ఆరోపణలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటు స్పందన
అధికారిక రికార్డులు, సర్వేలతో వాస్తవాలు తేల్చుకోవాలని స్పష్టం
వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 16,తరంగాలు :ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు విసిరిన సవాల్‌తో వర్ధన్నపేట నియోజకవర్గం లో హాట్‌టాపిక్ గా మారింది.ప్రముఖ న్యాయవాది నిమ్మని శేఖర్‌రావుకు చెందిన మామిడి తోట భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు,విమర్శలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్రంగా స్పందించారు. భూమి వ్యవహారంలో వాస్తవాలను అధికారిక రికార్డులు, రెవెన్యూ పత్రాలు, సర్వేల ఆధారంగా తేల్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. నిమ్మని శేఖర్‌రావు కోనారెడ్డి చెరువుకు సంబంధించిన ఒక్క 100గజాల భూమినైనా కలుపుకున్నట్లు నిరూపిస్తే, ఎలాంటి చర్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు .శేఖర్‌రావు సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వ్యక్తి అని ఎమ్మెల్యే పేర్కొంటూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని వ్యాఖ్యానించారు.
“చెరువు భూమి ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే.. ఆయనకు ఉన్న తోటలో సగభాగాన్ని రాసి ఇవ్వడానికి కూడా సిద్ధం. ఇది ఓపెన్ ఛాలెంజ్” అంటూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భూముల హద్దులు, యాజమాన్య హక్కులు, చెరువు పరిధి వంటి అంశాలపై సంబంధిత అధికారుల రికార్డులు, భూ సర్వే వివరాలు ఆధారంగా స్పష్టత ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిజిటల్ సర్వే పూర్తి చేసిన అధికారులు కోలారెడ్డి చెరువు భూమి అన్యాక్రాంతం కాలేదని, ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారని తెలిపారు.మాటలతో కాదు.. రికార్డులతో తేల్చుకుందామని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. కొందరు శేఖర్ రావు సామాజిక వర్గానికి చెందిన వారే కావాలని అతనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.కేవలం రాజకీయ ఆరోపణలతో నిర్ణయానికి రావడం సరికాదని అన్నారు.“ఒక్క గుంట ఆక్రమణ నిరూపిస్తే.. సగం తోట రాసిస్తాం!” అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వర్ధన్నపేట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే సవాల్‌పై ప్రతిపక్షాలు, సంబంధిత వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.