🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 20 Sep, 2026 | Page: 1

మామునూరు విమానాశ్రయానికి ‘ఓరుగల్లు’ పేరు పెట్టాలి


కాకతీయుల చరిత్రకు ప్రపంచ ద్వారంగా నిలవాలి:
సీఎం రేవంత్‌రెడ్డికి పల్లవి మాడల్ స్కూల్ చైర్మన్ రాచకొండ అశోక చారి
విజ్ఞప్తి


వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 20,తరంగాలు : మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్న చారిత్రక తరుణంలో విమానాశ్రయానికి పేరు ఎంపికపై ప్రజల అభిప్రాయాలను కోరడం అభినందనీయమని పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మాడల్ స్కూల్ చైర్మన్ రాచకొండ అశోక చారి పేర్కొన్నారు.
వరంగల్‌కు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉందని, కాకతీయుల రాజధానిగా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ నగరానికి ‘ఓరుగల్లు’ అనే చారిత్రక పేరు విశిష్టమైన గుర్తింపును కలిగి ఉందని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో మామునూరు విమానాశ్రయానికి ‘ఓరుగల్లు విమానాశ్రయం’ అనే పేరు పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయానికి ‘ఓరుగల్లు’ పేరు పెట్టడం ద్వారా కాకతీయుల వైభవం, వరంగల్ చారిత్రక నేపథ్యం, తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి మరింతగా పరిచయం అవుతాయని పేర్కొన్నారు.
మామునూరు విమానాశ్రయం కేవలం రవాణా కేంద్రంగా కాకుండా.. ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల ఘనతను ప్రపంచానికి చాటిచెప్పే ద్వారంగా నిలవాలని అశోక చారి ఆకాంక్షించారు.
🏠 Home