🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 23 Sep, 2026 | Page: 1

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయండి

కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 18004253424, 9154252936

వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 23 (తరంగాలు):
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, నాలాలు, కాలువల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 18004253424
సంప్రదించాల్సిన నంబర్: 9154252936
ప్రజల భద్రత దృష్ట్యా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.
🏠 Home