🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 25 Sep, 2026 | Page: 1

సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రతా కవచం..!

జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

జఫర్‌ఘడ్ , సెప్టెంబర్ 25 (తరంగాలు ప్రతినిధి ): నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జఫర్‌ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ నరసయ్య, జఫర్‌ఘడ్ ఎస్‌ఐ రామారావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సుప్రో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో, ఆయా గ్రామాల సర్పంచుల సహకారంతో సుమారు రూ.25 లక్షల వ్యయంతో మండలంలోని ప్రధాన కూడళ్లలో మొత్తం 75 వైఫై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సీసీ కెమెరాలు నేరస్థులకు హెచ్చరికగా పనిచేయడమే కాకుండా, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని తీరును గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామాల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, సంస్థలు ముందుకు రావాలని డీసీపీ పిలుపునిచ్చారు.
భద్రత కోసం ఇంత పెద్ద మొత్తంలో సీఎస్‌ఆర్ నిధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సుప్రో కంపెనీ అధినేత సంతోష్ జగ్ధని, సీఎస్‌ఆర్ హెడ్ సురేష్ రెడ్డా, జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, పబ్లిక్ రిలేషన్ విజయ్ కుమార్ నాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ రాజా, హెచ్‌ఆర్ హెడ్ ధనవర్మలను డీసీపీ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు.ఈ
కార్యక్రమంలో ఉప్పుగల్ సర్పంచ్ కొడారి సాంబరాజు, తిమ్మాపూర్ సర్పంచ్ పులి సమ్మయ్య, హిమ్మత్‌నగర్ సర్పంచ్ కడుదురి మమతా సోమయ్య, కోణాచలం సర్పంచ్ చంద రామ రమేష్, పోలీస్ సిబ్బంది, గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home