ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్,రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ
వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 27,తరంగాలు : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు, వెనుకబడిన వర్గాల ఆత్మబంధువు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు బిజెపి ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కొత్తవాడ జంక్షన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి,ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొనడమే కాకుండా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన నిష్కళంక దేశభక్తుడు ఆయన. చేనేత రంగానికి అభ్యున్నతికి, కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
బాపూజీ ఆశయాలను కేవలం సభలకే పరిమితం చేయకుండా, నేటి యువత ఆయన స్ఫూర్తితో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ బలహీన వర్గాల హక్కుల కోసం బిజెపి ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, సిద్ధం నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, బిజెపి రాష్ట్ర నాయకులు త్రీ లోకేశ్వరరావు, బైరి మురళీకృష్ణ, ముండ్రాతి వెంకటేశ్వర్లు, బైరి శ్యాంసుందర్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిలు కర్నె రవీందర్, విక్రం, భాస్కర్, బండి సుజాత, శివప్రసాద్, జిల్లా నాయకులు గుర్రాల చంద్రమౌళి, కొంతం సంగీత్, కోమాకుల నాగరాజు, గుర్రపు సత్యనారాయణ, గుంతిక శ్రీధర్, వల్లెల రమేష్, శోభా మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.