🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 27 Sep, 2026 | Page: 1

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం


తెలంగాణ సాధన, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్


వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 27,తరంగాలు :కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన త్యాగాలు, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ జీవితాంతం కృషి చేశారని, సమాజంలో సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు బలపడాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మహమ్మద్ అయూబ్ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను యువత స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ కాంగ్రెస్ నాయకులు గోరంట్ల రవి, మహమ్మద్ కమాలుద్దీన్, మహమ్మద్ పాష, శ్రీపాద సతీష్, నాంపల్లి యాదగిరి, కుద్దుష్, బండ్ల సురేందర్ తో పాటు పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home