వైద్యం అనేది వ్యాపారం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత
ప్రజారోగ్య సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం
అక్టోబర్ 6న కరీంనగర్‌లో నిర్వహణ- పోస్టర్ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
కరీంనగర్,అక్టోబర్ 1 (తరంగాలు ప్రతినిధి ):
కరీంనగర్ జిల్లాలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అక్టోబర్ 6న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. అత్యవసర వైద్యం 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, వైద్య పరీక్షలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, రోగుల బంధువులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆమె కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు, అధిక బిల్లులపై కఠిన నియంత్రణ ఉండాలని, చికిత్సకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల్లో పారదర్శకత తీసుకురావాలని అన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రైవేట్ ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. “వైద్యం అనేది వ్యాపారం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత” అనే అంశాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.
“ప్రజారోగ్య రంగంలోని సమస్యలు – పరిష్కార మార్గాలు” అనే అంశంపై అక్టోబర్ 6న ఉదయం 11 గంటలకు కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా సమీపంలోని హోటల్ మహతిలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు.
సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక ఆలోచనా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ అంకం శివరాణి, మానకొండూర్ ఇన్‌చార్జ్ చెన్నమల్ల చైతన్య, హుజూరాబాద్ ఇన్‌చార్జ్ సంతోష్ యాదవ్, చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పర్షారం గౌడ్, బసవేణి రాజేందర్, కుతాడి శ్రీనివాస్, చండి శ్రీనివాస్, మ్యాక వినోద్, యండి సల్మా, వంగల పవన్, కేతిరెడ్డి జయపాల్, దిటి శరిష రమేష్ తదితరులు పాల్గొన్నారు.