ఆరోపణలు కాదు దమ్ముంటే నిరూపించండి
పేదల పెన్నిధిపైనా పనికి రాని అభాండాలు
కాంట్రాక్టుల కోసం కాదు పేదల కన్నీళ్లు తుడిచేందుకు వచ్చాడు
వేవ్ లో గెలవలె ప్రజా ఆశీర్వాదంతో గెలిచాడు
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై ఆరోపణలపై పునరాలోచించాలి
యువజన కాంగ్రెస్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం
వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 03,తరంగాలు : గత పాలకుల అక్రమాలు చూసి విసిగి వేసారిన ప్రజలు రానున్న కాలంలో ప్రజా పాలనలో ప్రజలతో మమేకమయ్యే నేత కావాలని గత ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజుకు నియోజక వర్గ ప్రజలు పట్టం కట్టారని యువజన కాంగ్రెస్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం అన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును నేరుగా ఏం చేయలేని కొందరు రాజకీయ పిరికి పందలు మీడియా ద్వారా చిల్లర ఆరోపణలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని యకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి స్వార్ధ ప్రయోజనాలు లేకుండా గత మూడు దశాబ్దాలుగా ప్రజా సేవలోనే ఉన్నప్పటికీ ప్రజలతో మరింత దగ్గరయ్యేందుకు ,వారికి సేవ చేసేందుకే ఎమ్మెల్యే నాగరాజు రాజకీయాల్లోకి వచ్చినట్లు యకాంతం తెలిపారు.
ధనం,ధనం అని ప్రజలను మరిచి పాలించిన నేలన జనం జనం అనే నాయకుడు నిలబడి పాలన చేస్తుండడం తట్టుకోలేని కొందరు వ్యక్తులు కుట్రలు తమకు తెలుసునని వారికి కుట్రలకు తగిన గుణపాఠం సమయం వచ్చినపుడు ప్రజలే చెబుతారని అన్నారు. నిత్యం అక్రమాల వేదికగా నిలిచిన చోట అవినీతి పేరు లేకుండా చేస్తున్న ప్రజా పాలన ప్రత్యర్థుల భవిష్యత్తు ఆశలను తుదిపేస్తుండడం చూసి తట్టుకోలేక అవినీతి మరకలు అంటించాలని చూస్తే సహించేది లేదని యకాంతం హెచ్చరించారు.
*వేవ్ లో గెలవలె ప్రజా ఆశీర్వాదంతో గెలిచాడు*
ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు సంక్షేమాన్ని అందించడం ఓర్చుకోలేని కొందరు దుర్మార్గులు వేవ్ లో గెలిచాడని పనికి రాని ఆరోపణలు చేస్తూ ప్రజా తీరుకు అపహాస్యం చేస్తున్నారని యకాంతం మండిపడ్డారు.వేవ్ లో గెలిచినట్లు చెబుతున్న వ్యక్తులు ప్రజల వేవ్ లో గెలిచాడని ఒప్పుకుంటే మంచిదని ప్రజలే ఓటు వేయకుండా గెలవలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీరు గెలిస్తే గెలుపు వేరే వాళ్ళు గెలిస్తే వేవ్ అనడం మీ సంకుచిత మనసుకు సంకేతం అని యకాంతం అన్నారు.మీరు ఎన్ని కుట్రలు ఆరోపణలు చేసినా ప్రజాపాలనలో చేస్తున్న కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం,కేఆర్ నాగరాజు కలకాలం నిలిచిపోవడం పక్కా అని యకాంతం కొనియాడారు.
*కటిక బీదరికం,కంచు పళ్ళాలు కాదు కమిట్మెంట్ ఉన్నవారికే పదవులు
లక్ష్యం*
కేఆర్ నాగరాజు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చిన నాటి నుండి నియోజక వర్గంలో వచ్చిన పదవులు ,వాటికి కేటాయించిన వ్యక్తుల జీవితాలు తెలుసుకుంటే డబ్బుల ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే తప్పు ఒప్పుకుంటారని యాకంతం దుయ్యబట్టారు. పార్టీని పట్టుకుని దశాబ్ద కాలంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పార్టీ మారాలని ఒత్తిళ్లు వచ్చినా పార్టీనే నమ్ముకుని ఉన్న వ్యక్తులకే పదవులు ఇచ్చి గౌరవించిన విషయాన్ని యకాంతం గుర్తు చేశారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తులను రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించేలా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చూపిస్తున్న శ్రద్ధ భవిష్యత్ తరాలకు, యువనేతలకు ఆశాజనకంగా మారిందని అన్నారు.ఆర్థికంగా ఉన్నవార లేని వార అని చూడకుండా పార్టీ భవిష్యత్తు పార్టీపై కమిట్మెంట్ ఉన్న నేతలను ఎంచుకొని కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నామినేటెడ్ ,పార్టీ పదవుల్లో అవకాశాలు ఇస్తున్నారని ఇప్పటికైనా ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుని నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఇటీవల ఎమ్మెల్యేపై పనికి రాని ఆరోపణలు చేసిన ఓ మీడియా చానల్ కి యకాంతం సూచించారు.