🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 03 Oct, 2026 | Page: 1

ఎమ్మెల్యే నాగరాజుపై తప్పుడు ప్రచారం సహించేది లేదు



ఎన్‌టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలి


క్షమాపణ చెప్పకుంటే ఎన్‌టీవీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్‌గౌడ్


ఐనవోలు , అక్టోబర్ 3 ():
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజుపై తప్పుడు ఆరోపణలు, నిరాధార వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్‌గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న నాగరాజుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక కొందరు ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇటీవల పారదర్శకంగా జరిగిన పీఏసీఎస్ వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలపై ఎన్‌టీవీ ప్రసారం చేసినట్లు పేర్కొంటున్న కథనాలను నిరసిస్తూ శనివారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో నిరసన చేపట్టిన నాయకులు, కార్యకర్తలు ఎన్‌టీవీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నకరకంటి మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. సంబంధిత అంశంపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు ఎన్‌టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్‌టీవీ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి పాక్స్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి , కల్లెడ పాక్స్ చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు,దర్గా కాజీపేట పిఎసిఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, కుమారస్వామి, ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పోరం అధ్యక్షులు పోలపల్లి శివశంకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home