🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 06 Oct, 2026 | Page: 1

ఘనంగా ఎమ్మెల్యే మురళీనాయక్ జన్మదిన వేడుకలు



400 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులతో అంబేద్కర్ సెంటర్‌లో సందడి..

ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,చిలువేరు సమ్మయ్య గౌడ్


కేసముద్రం, అక్టోబర్ 06 (తరంగాలు): మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ జన్మదిన వేడుకలు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ (సమ్మి గౌడ్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

*సమ్మి గౌడ్ పిలుపుతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు*

సమ్మి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 400 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని ఎమ్మెల్యే మురళీనాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.

*ప్రతి కార్యకర్తకు అండగా నిలవాలి: గంట సంజీవరెడ్డి*


ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని సుమారు 400 మంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మురళీనాయక్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి అండగా నిలుస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మురళీనాయక్ ఆయురారోగ్యాలతో ఉండి మరింత రాజకీయంగా ఎదగాలని కోరుకున్నారు.

*మురళీనాయక్‌కు సమ్మి గౌడ్ ప్రత్యేక శుభాకాంక్షలు*

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే మురళీనాయక్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పార్టీ గుర్తించి, వారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని సమ్మె గౌడ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దస్రు నాయక్, టౌన్ పార్టీ అధ్యక్షులు రావుల మురళీ, అల్లం నాగేశ్వర్ రావు, అంబటి మహేందర్ రెడ్డి, వీరేష్ యాదవ్, ఆయూబ్ ఖాన్, బండారు వెంకన్న, కదిరే సురేందర్, బండారు దయాకర్, దామరకొండ ప్రవీణ్, బానోత్ వెంకన్న, బట్టు శ్రీనివాస్, భద్యనాయక్, ప్రభురాణి, దనమ్మ, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సర్పంచులు బాలాజీ రెడ్డి, వీరాస్వామి, సూరయ్య, సంతోష్ నాయక్, సుమన్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రామచంద్రు, నాయకులు సామల నర్సయ్య, పోలేపాక ఉప్పలయ్య, వోలం రాజు, చిదిరాల వసంతరావు, రియాజ్ ఖాన్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.
🏠 Home