నూతన సీఐ సంజీవరావును కలిసిన పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి
వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 09,తరంగాలు : వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన సీఐ సంజీవరావు కృషి చేయాలని వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి ఆకాంక్షించారు.
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంజీవరావును పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అబ్బిడి రాజిరెడ్డి మాట్లాడుతూ.. వర్ధన్నపేట ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సీఐ సంజీవరావును కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంజీవరావు శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని అబ్బిడి రాజిరెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ ఉన్నారు .