🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 05 Nov, 2026 | Page: 1

వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డికి ఘన సన్మానం


రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్


వర్ధన్నపేట, నవంబర్ 05, తరంగాలు ప్రతినిధి: వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అబ్బిడి రాజిరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమక్షంలో రాజిరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. అబ్బిడి రాజిరెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని అన్నారు. రైతుల సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. ఈ పదవి ఆయనకు మరిన్ని ప్రజాసేవా అవకాశాలను కల్పించాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మండల అధ్యక్షులు పొశాల వెంకన్న గౌడ్ , ఇస్లావత్ సావిత్రి, దాడి శివ, ఇండ్ల రవికుమార్, డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణాకర్, సయ్యద్ ఇంతియాజ్, మాడుగుల రాజ్ కుమార్, అశోక్, మహమ్మద్ జానీ, పసునూరి శ్రవణ్, కాంగ్రెస్ నాయకులు మన్నె బాబురావు, శ్రీపాధి సతీష్, ప్రవీణ్, గోదాసి చిన్న, కిన్నెర రవి, మంద సన్నీ, షేక్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home