🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 19 Nov, 2026 | Page: 1

పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలి: కొర్ర సుమలత



ములుగు పట్టణ బంద్‌కు వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలి


సామాన్య ప్రజలపై పన్నుల భారం మోపడం సరికాదు – బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత

ములుగు, నవంబర్ 19(తరంగాలు ప్రతినిధి ): ములుగు పట్టణంలో అడ్డగోలుగా పెంచిన పన్నుల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని బీజేపీ మహిళా మోర్చా ములుగు జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత అన్నారు. పట్టణ ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా పన్నులు పెంచడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారం మోపేలా పెంచిన పన్నులను తక్షణమే తగ్గించి, పెంపును రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 20వ తేదీ శుక్రవారం ములుగు పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు వ్యాపారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపి సహకరించాలని కొర్ర సుమలత కోరారు. ప్రజల సమస్యలపై నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.పెంచిన పన్నులను వెంటనే రద్దు చేసేలా ఉన్నతాధికారులు స్పందించాలని, ప్రజలకు ఉపశమనం కల్పించాలని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పన్నుల పెంపుపై అధికారులు పునరాలోచించాలని ఆమె కోరారు.
🏠 Home