🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 22 Nov, 2026 | Page: 1

డా. వన్నాల వెంకటరమణ నివాసానికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

వన్నాల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించిన గవర్నర్

మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములును పరామర్శించి యోగక్షేమాల ఆరా

హనుమకొండ, నవంబర్ 22 (తరంగాలు ప్రతినిధి):
త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం హనుమకొండలోని అడ్వకేట్ కాలనీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వన్నాల వెంకటరమణ తన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులతో కలిసి గవర్నర్‌కు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములును ఆప్యాయంగా పలకరించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వన్నాల శ్రీరాములు సతీమణి స్వర్గీయ విజయలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వన్నాల కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన తేనీటి విందులో గవర్నర్ పాల్గొన్నారు. తమ నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపిన గవర్నర్‌కు డా. వన్నాల వెంకటరమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ రాజేశ్వర్ రావు, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, వంగల సమ్మిరెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home