పేపర్ లీకేజీలను అరికట్టలేని చేతగాని బిజెపి ప్రభుత్వం
న్యాయం కోరిన విద్యార్థి-యువతపై లాఠీచార్జ్ అమానుషం ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ తరంగాలు ఖమ్మం జిల్లా బ్యూరో, 22జులై, తరంగాలు : గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు 100కు పైగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకుని లక్షలాది మంది విద్యార్థుల, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు న్యాయం కోరుతున్న విద్యార్థి, యువతపై దమనకాండకు పాల్పడుతోందని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై న్యాయ విచారణ జరిపి,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని...