వర్షాకాలంలో మధ్యాహ్నం కునుకు.. మంచిదేనా?

చిన్నపాటి విశ్రాంతితో శరీరానికి నూతన ఉత్సాహం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్రపై ప్రభావం మితమైన కునుకే ఆరోగ్యానికి మేలు (తరంగాలు ప్రతినిధి)జూలై 24: వర్షాకాలంలో చల్లని వాతావరణం, మేఘావృతమైన ఆకాశం కారణంగా మధ్యాహ్నం సమయంలో నిద్రమత్తు ఎక్కువగా అనిపించడం సహజం. దీంతో చాలామంది భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు కునుకు తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈ అలవాటు ఎంతసేపు పాటిస్తున్నామన్నదే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం 15 నుంచి 30 నిమిషాల వరకు తీసుకునే చిన్నపాటి కునుకు శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. అలసట తగ్గి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మెదడు చురుకుదనం, ఏకాగ్రత, పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి...