చెన్నారం లబ్ధిదారులకు వెంటనే ప్లాట్లు కేటాయించి, పట్టాలు అందించాలి
ఇళ్ల నిర్మాణ గడువు పొడిగించాలని జిల్లా కలెక్టర్‌కు BC, SC, ST-JAC వినతి వరంగల్ ప్రతినిధి , జూలై 24, తరంగాలు : వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించి, క్షేత్రస్థాయిలో ప్లాట్లను మార్కింగ్ చేసి పట్టాలు అందజేయాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి విధించిన మూడేళ్ల గడువును పొడిగించాలని కోరుతూ BC, SC, ST-JAC నాయకులు, బాధిత లబ్ధిదారులు వరంగల్ జిల్లా కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయం ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, లేఅవుట్‌లో ఏ ప్లాట్ ఎవరికి కేటాయించబడిందో...