తిరుమలలో తెలంగాణ కూచిపూడి కళాకారుల ప్రతిభకు జాతీయ వేదిక
అభినయ ఆర్ట్స్ జాతీయ కూచిపూడి నాట్య కళా మహోత్సవంలో నటరాజ డాన్స్ అకాడమీ విద్యార్థుల ఆకట్టుకునే ప్రదర్శన తిరుమల, జులై 25,తరంగాలు : శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన అభినయ ఆర్ట్స్ జాతీయ కూచిపూడి నాట్య కళా మహోత్సవంలో హైదరాబాద్‌కు చెందిన నటరాజ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి ప్రతిభకు సభికుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతీయ స్థాయి నాట్య మహోత్సవంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ...