ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో మేధావుల పాత్ర కీలకం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ హైదరాబాద్, జూలై 27, తరంగాలు :ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో మేధావుల పాత్ర కీలకం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ అన్నారు.హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న తాజ్ డెక్కన్ హోటల్‌లో నిర్వహించిన "ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్" మేధావుల సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి మాట్లాడుతూ, ఆత్మనిర్భర భారత్ దేశ ఆర్థికాభివృద్ధికి...