వర్ధన్నపేట రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా నిర్వహణ
వర్ధన్నపేట ప్రతినిధి , జూలై 27, తరంగాలు : వర్ధన్నపేట రైతు వేదికలో సోమవారం విత్తన మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య మరియు స్థానిక తహసీల్దార్ విద్యాసాగర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ఎరువులు, విత్తనాల డీలర్లు తమ సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలను ప్రదర్శించారు. ముఖ్యంగా పెసర, కంది, మినుములు, బొబ్బర్లు వంటి పప్పుధాన్యాల విత్తనాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ...