పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన సీతక్క
ఆరోగ్య పరిస్థితిపై ఆరా వైద్యులతో చికిత్సపై సమీక్ష ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ హైదరాబాద్, జూలై 27 (తరంగాలు ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి చికిత్స పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య బృందాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, చికిత్సకు శరీరం ఎలా స్పందిస్తోందో వివరాలను పరిశీలించారు....