అనాథ చిన్నారుల భవిష్యత్తుకు అండగా వాక్ ఫౌండేషన్
అనాథ చిన్నారుల భవిష్యత్తుకు అండగా సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం ఇద్దరు చిన్నారుల విద్యాభ్యాసం కోసం రూపాయలు 24 వేల చెక్కు అందజేసిన వాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ వరంగల్ ప్రతినిధి , జూలై 27, తరంగాలు : సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో నిరుపేద కుటుంబాలకు, అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్న వాక్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరంగల్ 28వ డివిజన్‌కు చెందిన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఉపుల సతీష్–స్రవంతి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బలవన్మరణం చెందడంతో అనాథలైన వారి కుమారులు మాస్టర్ విహాన్,...