అభివృద్ధిపై చర్చకు బదులు వాకౌట్ ఎందుకు..?

బీఆర్ఎస్, బీజేపీ సర్పంచుల తీరుపై ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య విమర్శలు రాజకీయాల కంటే గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన ఇల్లంద ఘటనలో నిబంధనలు పాటించాల్సిందేనని వ్యాఖ్య ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల రాద్ధాంతమని ఆరోపణ వర్ధన్నపేట ప్రతినిధి , జూలై 30, తరంగాలు : వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శ్రీపతి అధ్యక్షతన, ఎంపీడీఓ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో రాజకీయ వాతావరణం నెలకొంది. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, బీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు సమావేశం నుంచి వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు....