ఒక ఉద్యమ స్వరం మూగబోయింది...
ప్రజల మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజా సేవ వరకు... ఓ నిబద్ధ నాయకుడి మహాప్రస్థానం నర్సంపేట, జులై 31,తరంగాలు : తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక బలమైన స్వరం... నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఓ ప్రజా నాయకుడు... ఇక లేరు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని సాగిన ఆయన ప్రస్థానం అర్ధాంతరంగా ముగియడం అభిమానులను, కార్యకర్తలను తీవ్ర విషాదంలో ముంచింది. 52 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూయడం నర్సంపేట...