తల్లిపాలే శిశువుకు తొలి వరం
ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవం తల్లి–బిడ్డ ఆరోగ్యానికి అమూల్యమైన వరం అవగాహనతోనే ఆరోగ్యవంతమైన భావితరం డెస్క్, జూలై 31 (తరంగాలు ప్రతినిధి): ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నవజాత శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం, తల్లిపాలపై అపోహలను తొలగించడం, ప్రతి శిశువుకు జీవితంలోని తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందేలా ప్రోత్సహించడం ఈ వారోత్సవం ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌తో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ వారోత్సవంలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు అత్యంత...