కళాకారులకు పెద్దన్న... పేదలకు భరోసా ఈగ మల్లేశం
సేవా ప్రస్థానానికి ఘన సత్కారం.. ఈగ మల్లేశం - సంగీత దంపతులకు ‘స్వరాభిషేకం’ వేదికపై ఘన సన్మానం కళా,సామాజిక,ప్రజాసేవకు గుర్తింపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి మధురస్మృతులలో నిర్వహించిన కార్యక్రమం హనుమకొండ ప్రతినిధి, ఆగస్టు 1,తరంగాలు : కళాకారుల సంక్షేమం, నిరుపేదలకు చేయూత, విద్యార్థులకు విద్యాసహాయం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందిన ఈగ మల్లేశం ఘన సన్మానం అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల ఎస్. జానకి మధురస్మృతులను స్మరించుకుంటూ నిర్వహించిన “స్వరాభిషేకం” మహోత్సవ వేదికగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ఈగ మల్లేశం- సంగీత దంపతులకు గజమాలతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని అందజేశారు. సేవను జీవిత...