కేసముద్రం కాంగ్రెస్‌కు "కొత్త సారథి.. సమ్మి గౌడ్"

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మి గౌడ్ నియామకం నిజాయితీ,నిస్వార్థానికి నిలువుటద్దం.. “పదవి కోసం కాదు.. ప్రజాసేవ కోసమే పనిచేస్తా” “24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా.. పార్టీ బలోపేతమే నా లక్ష్యం” అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సమ్మి గౌడ్ కేసముద్రం, ఆగస్టు 7,తరంగాలు ప్రతినిధి :కేసముద్రం కాంగ్రెస్‌కు "కొత్త సారథి"..గా సమ్మి గౌడ్ పేరును శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మి గౌడ్ నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు....