భర్త హత్యకు భార్య కుట్ర..?
మరో వ్యక్తితో చాటింగ్.. ‘ప్రమాదంలా’ మర్డర్ చేయాలనే ప్లాన్? వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్‌షాట్లతో పోలీసులను ఆశ్రయించిన భర్త భార్య,మరో వ్యక్తిపై సంచల ఆరోపణలు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఖమ్మం, ఆగస్టు 7 (తరంగాలు ప్రతినిధి): భార్య, ఆమెకు పరిచయం ఉన్న మరో వ్యక్తి కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఓ భర్త చేసిన ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో కలకలం రేపాయి. భార్య మొబైల్‌లో కనిపించిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ ఆధారంగా తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో...